వైయస్ఆర్‌ ఘాట్‌కు అభిమాన జనసంద్రం

ఇడుపులపాయ, 1 అక్టోబర్ 2013 :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి రాక సందర్భంగా ఇడుపులపాయకు అభిమాన జనసంద్రం పోటెత్తింది. మహానేత తనయుడు, జగనేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిని చూసేందుకు అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కోర్టు అనుమతితో తండ్రి సమాధిని సందర్శించేందుకు వచ్చిన‌ శ్రీ జగన్ను కలిసేందుకు అభిమాను‌లు భారీ సంఖ్యలో రావడంతో జనసునామీ వచ్చిందా అనిపిచింది. మహానేత, తన తండ్రికి నివాళులు అర్పించిన అనంతరం శ్రీ జగన్మోహన్‌రెడ్డి వైయస్ఆర్‌ ఘాట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ పలకించారు.

సుదీర్ఘ కాలం తర్వాత తమ అభిమాన నేతను ప్రత్యక్షంగా కలుసుకునేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పలువురు పోటీపడ్డారు. దానితో ఇడుపులపాయ కిటకిటలాడింది. వైయస్ కుటుంబ సభ్యులు వై‌యస్ వివేకానందరెడ్డి, అవినా‌ష్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులు అమర్నా‌థ్‌రెడ్డి, జి. శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఇతర ముఖ్య నాయకులు వైయస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top