మంచిరోజులు రాబోతున్నాయ్‌...

విజయనగరంః పిన్నింటి రామనాయుడు వలస వద్ద వైయస్‌ జగన్‌ సెలూన్‌ షాపులోకి వెళ్ళి షాపు యాజమానిని  కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే సెలూన్‌ షాపులకు ఏడాదికి రూ.10 వేల రూపాయలు లేదా 250 యూనిట్లు విద్యుత్‌ ఇస్తామనే హామీని గుర్తుచేశారు. వైయస్‌ జగన్‌ స్వయంగా తన సెలూన్‌ షాపుకు రావడంతో షాపు యాజమాని మురిసిపోతున్నారు. సెలూన్‌ షాపుల  ఆదాయం, ప్రభుత్వం నుంచి ఏవిధమైన సాయం అందుతుందా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయీ బ్రాహ్మణులకు మేలు చేస్తామని వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారని షాపు యాజమాని తెలిపారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వస్తే సంక్షేమ రాజ్యం వస్తుందని నాయీ బ్రాహ్మణులంతా విశ్వాసంతో ఉన్నారని తెలిపారు.
 

Back to Top