- ప్రజా సంకల్ప యాత్రలో ఘనంగా వైయస్ జగన్ జన్మదిన వేడుకలు- జననేతకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు, సిక్కొలు ప్రజలు- వచ్చే జన్మదిన వేడుకలు సీఎం హోదాలో చేసుకుంటామంటూ నినాదాలుశ్రీకాకుళం: చంద్రబాబు పాలనలో మోసపోయిన ప్రజలకు భరోసానిచ్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన రాజన్న తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి విశేష ఆదరణ లభిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగిస్తున్న జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం కావడంతో వేలాదిగా తరలివచ్చిన జనం, వందలాదిగా వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జననేత 327వ రోజు పాదయాత్రను శుక్రవారం ఉదయం టెక్కలి నియోజకవర్గంలోని సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం నుంచి ప్రారంభించారు. అక్కడ పార్టీ శ్రేణులు భారీ కేక్‌ను తెచ్చి తమ అభిమాన నేతతో కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
వచ్చే జన్మదినం నాటికి ముఖ్యమంత్రి హోదాలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటామని యువత నినాదాలతో హోరెత్తించారు. లాంగ్ లీవ్ జగనన్న..కాబోయే సీఎం జగనన్న, హ్యాపీ బర్త్ డే జగనన్న అంటూ స్థానికులు నినదించారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ..దారి పొడవునా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రగా ముందుకు కదులుతున్నారు. మన కష్టాలు తీర్చేందుకు అసలైన నాయకుడిలా వచ్చిన రాజ న్న బిడ్డ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు, అడుగులు పంచుకునేందుకు పరుగులు పెడుతున్నారు.
జనం సమస్యలను తెలుసుకునేందుకు ఎండైనా, వానైనా.. వెరవకుండా ముందుకు సాగి న వాడే అసలు సిసలైన నాయకుడు. అలాంటి నిజమైన ప్రజా నాయకుడ్ని చిక్కోలు ప్రజలు అతి దగ్గరగా చూశారంటే అతిశయోక్తి కాదు. దారిపొడవునా ప్రజల కష్టాలను తెలుసుకు ని, వారి సమస్యలను ఓపిగ్గా వింటున్నారు.