గుంటూరు, 2 సెప్టెంబర్ 2012: గుంటూరు కొరిటిపాడుకు చెందిన వీరారెడ్డి అనే వైయస్ వీరాభిమాని సొంతఖర్చులతో ఆలయాన్ని నిర్మించి నిత్యం భక్తిప్రపత్తులతో పూజాదికాలు నిర్వహిస్తున్నాడు.తన ఇంటిలో కూడా తన అభిమాన మహానేత భారీ ఫోటోలను పెట్టుకుని ఆరాధిస్తున్నాడు.ఆయనే కాదు, ఆయన తల్లితండ్రలతో సహా ఆయన కుటుంబ సభ్యులంతా కూడా నిత్య పూజల్లో పాల్గొంటూ వైయస్‌ఆర్‌ను దైవంలా కొలుస్తున్నారు.