విజయసాయిరెడ్డికి అభినందనలు

హైదరాబాద్)
రాజ్యసభ ఎంపీ గా ఎన్నికైన పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని పలువురు
ప్రముఖులు అభినందనలు తెలిపారు.

ఉత్తరాంధ్ర
కు చెందిన పలువురు పార్టీ నాయకులు ఆయన్ని నివాసంలో కలుసుకొన్నారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు
తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో ఆ
జిల్లా నాయకులు కలిశారు. తర్వాత విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ
కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, రాజన్నదొర, ఇతర నాయకులు
కలిశారు. శ్రమ తీసుకొని అభినందించేందుకు వచ్చిన నాయకులు అందరికీ విజయసాయిరెడ్డి
పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. 


Back to Top