ఎంపీల‌కు ఘ‌న స్వాగ‌తం

విజ‌య‌వాడ‌: ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి మొట్ట మొద‌టి సారిగా రాష్ట్రానికి వ‌చ్చిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. కొద్ది సేప‌టి క్రితం గ‌న్న‌వ‌రం ఏయిర్‌పోర్టులో మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్‌, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల‌కు పార్టీ నాయ‌కులు విజ‌య‌సాయిరెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, పార్థ‌సార‌ధి,  వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, మ‌ల్లాది విష్ణు, పుణ్య‌శీల త‌దిత‌రులు స్వాగ‌తం ప‌లికి, దుశ్శాలువాల‌తో స‌త్క‌రించారు. అనంత‌రం వారు వైయ‌స్ జ‌గ‌న్ మోహన్‌ రెడ్డిని కలిసేందుకు నూజివీడుకు బయలుదేరుతారు. ఈ నెల 6వ తేదీన ప్రత్యేక హోదా సాధనకు ఎంపీ పదవులకు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్, అవినాష్‌రెడ్డిలు ఆమరణ దీక్ష చేపట్టారు. ఆ తరువాత వారి దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీ పరిణామాలను వైయస్‌జగన్‌కు వివరించేందుకు ఎంపీలు విజయవాడకు వచ్చారు.  

తాజా వీడియోలు

Back to Top