ఎదురెళ్లి స్వాగ‌తం ప‌లికిన ఎచ్చెర్ల ప్ర‌జ‌లు- జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆత్మీయ స్వాగ‌తం  
- పాద‌యాత్ర దారి వెంట పండుగ వాతావ‌ర‌ణం
శ్రీ‌కాకుళం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత 312వ రోజు పాదయాత్ర మంగళవారం ఉదయం అంతకాపల్లి నుంచి ప్రారంభం కాగా  వీఆర్‌ అగ‍్రహారం క్రాస్‌, పొగిరి, మర్రివలస క్రాస్ మీదుగాఎచ్చెర్ల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సంద‌ర్భంగా స్థానికులు గంగువారి సిగడాం మండలంలోని గేదెలపేట క్రాస్ వ‌ద్ద జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. ఎదురెళ్లి మ‌రీ రాజ‌న్న బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లికి..మీరే మా కాబోయే సీఎం అంటూ నిన‌దించారు. అక్క‌డి నుంచి నియోజ‌క‌వ‌ర్గంలోని మెట్టవలస క్రాస్‌, పలఖండ్యాం, సంతవురిటి వరకు జననేత పాదయాత్ర కొనసాగింది.

వైయ‌స్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకున్నారు.  పలువురు ప్రభుత్వ వైఖరితో ఎదురవుతున్న సమస్యలను వైయ‌స్ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలన్నీ ఓపిగ్గా వింటూ అందరి యోగక్షేమాలను వైయ‌స్ జగన్‌ తెలుసుకున్నారు. మరికొద్ది నెలల్లో మనందరి ప్రభుత్వంగా వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు.   

తాజా వీడియోలు

Back to Top