వైయస్‌ఆర్‌ ప్రభతో జననేతకు స్వాగతం


–వినూత్నంగా స్వాగతం పలికిన వేంపాడు గ్రామస్తులు
కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గంలోని వేంపాడు గ్రామస్తులు వైయస్‌ జగన్‌కు వైయస్‌ఆర్‌ ఫోటోలతో తయారు చేసిన ప్రభలతో వినూత్నంగా స్వాగతం పలికారు. మహానేత చేసిన మేలులను గుర్తు చేసుకుంటూ గ్రామస్తులు వైయస్‌ జగన్‌ను కలిశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫోటోలతో వేంపాడు గ్రామానికి చెందిన శివశంకర్‌  ప్రభలు కట్టి వైయస్‌ జగన్‌కు స్వాగతం పలికారు. వైయస్‌ఆర్‌ పాలనలో మేలు జరిగిందని, అందుకు కృతజ్ఞతగా ప్రభలు తయారు చేసి రాజన్న బిడ్డకు ఆత్మీయ స్వాగతం పలికారు. 2004లో తన తండ్రి శ్రీనివాసరావుకు గుండె ఆపరేషన్‌ జరిగిందని, ఇందుకు రూ.6 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మా నాన్నకు ఉచితంగా ఆపరేషన్‌ చేయించి బతికించారన్నారు. మహానేత చేసిన మేలులను మరిచి పోలేదని శివశంకర్‌ తెలిపారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర విజయవంతం కావాలని వేంపాడువాసులు కోరారు. 
 

తాజా వీడియోలు

Back to Top