కర్నూలు: అగ్ని ప్రమాదంలో పంట కాలిపోయి నిరాశలో ఉన్న పొగాకు రైతులను పాణ్యం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పరామర్శించారు. పాణ్యం మండలం, నెరవాడ గ్రామం, ఓర్వకల్లు మండలం,హెచ్ కోట్టాల గ్రామాల్లో వరుస అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనలో రైతులు పండించిన పొగాకు కాలి బూడిద అయ్యింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాధిత కుటుంబాలను పరామర్శించి, ఓదార్చారు. రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే తన వంతుగా కొంత ఆర్థికసాయాన్ని అందజేశారు. <br/>