<strong>శ్రీకాకుళంః </strong>రాజాం నియోజకవర్గంలో సమస్యలు అ«ధికంగా ఉన్నాయని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. టీడీపీ ప్రభుత్వం రాజాం నియోజకవర్గంపై వివక్ష చూపిస్తుందన్నారు.సమస్యలు అన్నీ వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. రాజాం నగర పంచాయతీగా ఏర్పడి 16 సంవత్సరాలు అవుతున్న నేటికి కూడా ఎన్నికలు జరగలేదన్నారు.పూర్తిగా అభివృద్ధి కుంటుపడింది. తాగు,సాగునీరు లేక ప్రజలు,రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీస సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదన్నారు.డ్రైనేజీలు కూడా లేకపోవడం మురుగునీరు చేరి ప్రజలు రోగానబారిన పడుతున్నారన్నారు. నేడు రాజాంలో జరగబోయే బహిరంగసభలో వైయస్ జగన్ ప్రసంగం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నారు.