ఆయ‌క‌ట్టుకు నీరందించ‌డంలో స‌ర్కార్ విఫ‌లం

క‌ర్నూలు: క‌ర్నూలు-క‌డ‌ప కెనాల్ ఆయ‌క‌ట్టుకు నీరందించి పంట‌లు కాపాడ‌టంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజ‌య్య ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌గిడ్యాల మండ‌ల ప‌రిధిలో ఎండిపోతున్న వ‌రి పైర్ల‌ను ఎమ్మెల్యే ఐజ‌య్య ప‌రిశీలించారు. రైతుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ముచ్చుమ‌ర్రి ఎత్తిపోత‌ల ప‌థ‌కం నుంచి నీరిచ్చి రైతుల‌ను ఆదుకుంటామ‌న్న చంద్ర‌బాబు మాట‌లు నీటి మూట‌లే అని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా ఆయ‌క‌ట్టు పొలాల‌కు నీరివ్వ‌క‌పోతే ఆందోళ‌న చేప‌డుతామ‌ని ఐజ‌య్య హెచ్చ‌రించారు

Back to Top