ప్రకాశం: మంచినీటి ఎద్దడి నివారణలో తెలుగు దేశం ప్రభుత్వం విఫలమైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి మండిపడ్డారు. గిద్దలూరు పట్టణoలోని 9,10వ వార్డులలో నెలకొన్న నీటి ఎద్దడి సమస్య పరిష్కారానికి తన సొంత నిధులతో నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. ఐవీ రెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువు ఆయన వెంటే వస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన టీడీపీ నేతలు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలులో విపక్ష జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరు మారకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.