జగనన్నతోనే రాజన్న రాజ్యంఅనంతపురం: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకువస్తారని, జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని గట్టు శ్రీకాంత్‌రెడ్డి కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని తెలిపారు. ఏపీలో అభివృద్ధి ఆగిపోయిందని, నాలుగేళ్లలో చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు. ఇందుకు నిదర్శనమే వైయస్‌ జగన్‌ పాదయాత్రలో వెలుగు చూస్తున్న సమస్యలు అన్నారు. టీడీపీ నేతలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. మరో ఏడాదిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు వైయస్‌ జగన్‌కు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. 
 
Back to Top