రైతులకు బేడీలు వేస్తారా..?

హైదరాబాద్‌: కేసీఆర్‌ ప్రభుత్వం దేశ రైతాంగాన్ని అవమానపరిచే విధంగా వ్యవహరించిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసి పోలీసులు కోర్టుకు తీసుకెళ్లడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లడం దుర్మార్గపు చర్య అని ఆయన మండిపడ్డారు. రైతులు ఏమైనా తీవ్రవాదులా..? లేక దేశ ద్రోహులా..? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం రైతుల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, దీనికి కేసీఆర్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top