రైతుల గురించి అసెంబ్లీలో చర్చించకపోవడం బాధాకరం

రాయచోటి రూరల్‌:  అసెంబ్లీ సమావేశంలో రైతుల గురించి ఒక గంట కూడా చర్చించకపోవడం దారుణమని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.  రాయచోటి మండలం మాధవరం గ్రామంలోని మూలవాండ్లపల్లెలో ఎమ్మెల్యే పర్యటించి రైతులతో పలు సమస్యలపై చర్చించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని , అంతో ఇంతో సాగైన పంటలకు గిట్టుబాటు ధర కూడా లేదని పలువురు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సంధర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ....రైతు సమస్యలపై వై/స్సార్‌సీపీ సభ్యులు అసెంబ్లీలో గొంతు చించుకున్నా ప్రభుత్వంలో ఉలుకూ పలుకూ లేదని ఆవేOన వ్యక్తం చేశారు. ధరల స్థిరీకరణకు రూ.5వేల కోట్లు కేటాయించమని అడిగినా సమాధానం కరువైందన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించకుండా ఇష్టారాజ్యంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలకు కోట్లాది రూపాయలు దోచిపెడుతోందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీని వైయస్‌ జగన్‌ రాష్ట్ర శ్రేయస్సు కోసం కలిస్తే టీడీపీ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వేరే దేశ ప్రధానిని కలిసి, ఈ దేశ రహస్యాలను చెప్పినట్లుగా అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి గురించి ప్రధాని మోదీకి తెలిసిందన్న బాధతో టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేయని ప్రభుత్వాలు తమ ఉనికి కోల్పోయి కనుమరుగయ్యాయని , అదే గతి టీడీపీకి కూడా త్వరలోనే పట్టనుందన్నారు. ఎన్నికల్లో రైతులు, ప్రజలు టీడీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు పోలు సుబ్బారెడ్డి, సింగల్‌విండో ప్రసిడెంట్‌వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాఉల కృష్ణవేణి, సింగల్‌విడో డైరెక్టర్‌విశ్వనాథ ,రైతులు తదితరులు పాల్గొన్నారు.


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top