దేశం ఓ గొప్ప నేతను కోల్పోయింది


అమ‌రావ‌తి: భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి మృతి ప‌ట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిగ్భాంతి వ్య‌క్తం చేశారు. వాజ్‌పేయి మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం తెలిపారు. ఈ మేర‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ సంతాప సందేశం పంపారు.  ‘‘భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి గారు మర ణించార న్న వార్త ఎంత‌గానో బాధించింది. అటల్‌జీ మర ణంతో మన దేశ రాజకీయాల్లో ఓ గొప్ప శకం ముగిసినట్లైంది. విభేధించే రాజకీయపార్టీలవారికి కూడా ఆమోదయోగ్యుడిగా, అద్భుతమైన, ఆకట్టుకునే వక్తగా, కవిగా, రాజకీయ విలువలూ మర్యాదల పరంగా శిఖర సమానుడిగా, విదేశీ దౌత్య దురంధరుడిగా, పార్ల‌మెంటరీ సంప్రదాయాల పరంగా మహోన్నతుడిగా వాజ్‌పేయి గారుఅందరి మన్ననలూ పొందారు. దేశానికి ఆయన చేసిన సేవలు, రాజకీయాల్లో ఆయన నెలకొల్పిన విలువలు కలకాలం గుర్తుంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను .’’ 

- వైయ‌స్ జ‌గ‌న్ సంతాప సందేశం

Back to Top