<br/><br/> <br/> <br/>కృష్ణా జిల్లా: విశాఖ జిల్లా యలమంచిలి మాజీ ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తి రాజు(కన్నబాబు), ఆయన కుమారుడు, విశాఖ డీసీసీబీ చైర్మన్ యు. సుకుమారవర్మలు తెలుగుదేశం పార్టీ వీడి వైయస్ఆర్‌సీపీలో చేరారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్‌ను వారు కలిసి పార్టీలో చేరారు. వారికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట మరో వెయ్యి మంది వైయస్ఆర్‌సీపీలో చేరారు. కన్నబాబు విశాఖపట్నం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పనిచేశారు. 2014 ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..వైయస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని, అందుకోసం తాను కూడా సైనికుడిలా పని చేస్తానని చెప్పారు.