వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామా

 
ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనలో భాగంగా వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్, మిథున్‌రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితమే వారు స్పీకర్‌ ఫార్మెట్‌లో రాజీనామాలు చేసి స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ..నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పోరాడుతూనే ఉన్నామన్నారు. అయినా రాష్ట్రానికి న్యాయం జరగలేదన్నారు. అందుకే రాజీనామాలు చేశామని తెలిపారు. 
 

తాజా వీడియోలు

Back to Top