పాకిస్తాన్‌ చెర నుంచి తమ వారిని విడిపించాడయ్యా...


వైయస్‌ జగన్‌కు మత్సకార కుటుంబాలు  మొర...

శ్రీకాకుళంః గుజరాత్‌లో చేపల వేటకు వెళ్లిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మత్స్యకారులను సరిహద్దు దాటారంటూ పాకిస్తాన్‌ దళాలు పట్టుకున్నాయి.అప్పటి నుంచి బాధితుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ప్రజా సంకల్పయాత్రలో  వైయస్‌ జగన్‌ను కలిసి తమ వారిని విడిపించాలని వేడుకున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విడిపించాలన్నారు. వైయస్‌ జగన్‌ను సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విడిపిస్తామన్నారు. వారిపైనే ఆధారపడి ఉన్నామని,ఆదుకునే దిక్కులేక రోడ్డును పడ్డామని మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పాకిస్తాన్‌ చెరలో ఉన్నవారితో మాట్లాడే అవకాశం కల్పించాలన్నారు. టీడీపీ ప్రభుత్వం కూడా ఆదుకోవడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులపై వివక్ష చూపుతోందని,  కనీసం పరామర్శ కూడా చేయలేదన్నారు. ఆర్థిక సాయం కూడా అందించలేదన్నారు.  హర్బర్‌ లేకపోవడంతో గుజరాత్‌కు వేటకు వెళ్ళాల్సివస్తుందని మత్స్యకార కుటుంబీకులు తెలిపారున.మత్స్యకారులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
 

Back to Top