- వైయస్ జగన్‌ను కలిసిన మత్స్యకారులు, మానవ హక్కుల సభ్యులువిజయనగరంః వైయస్ జగన్‌ను కలిసిన మైదాన ప్రాంత మత్స్యకారులు తమ సమస్యలు చెప్పుకున్నారు. జీవో 343 రద్దు చేయాలని మత్స్యకారులు కోరారు. చేపల చెరువుల్ల మత్స్యసంపద నష్టపోతే పరిహారం ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశారు. చేపల చెరువులను పంచాయతీ, మున్సిపాలిటీ పరిధి నుంచి తప్పించాలని వినతించారు. అలాగే వైయస్ జగన్‌ను కలిసిన జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ సభ్యులు గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. సంక్షేమ హాస్టళ్లలో కనీస వసతులు కల్పనకు కృషిచేయాలన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు మేలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.