<br/><strong>హైదరాబాద్</strong> : ఎస్టీ, ఎస్టీ అత్యాచారాల చట్టానికి సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పై జోక్యం చేసుకుని , ఆ తీర్పుు సమీక్షించే విధంగా చూడాలని ను వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలకు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ఆయన సోమవారం నాడు వీరిరువురికి వేర్వేరుగా లేఖలు రాశారు. సుప్రీం కోర్టు తీర్పు తాజా తీర్పును ఆధారంగా చేసుకుని, ఎస్సీ, ఎస్టీల అత్యాచారాల నిరోధకం చట్టం స్పూర్తి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనితో ఎస్సీ, ఎస్టీలు అభద్రతా భావానికి లోనవుతారని తెలిపారు. దేశంలోని ప్రతి రోజూ ఏదో ఒక చోట ఎస్సీ,ఎస్టీలపై దురాగతాలు నమోదు అవుతున్నాయని ఆయన ఆలేఖలో పేర్కొన్నారు.<br/>మరో వైపున దాదాపు 40 ఏళ్ల పాటు రాజకీయ జీవితంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే దళితుడిగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ వ్యాఖ్యానించారనీ, అదే సమయంలో మరో మంత్రి ఆదినారాయణరెడ్డి పరిశుభ్రంగా ఉంటారంటూ దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన సంగతిని ప్రస్తావించారు. ఇవి రాష్ట్రంలోని పాలకుల ధోరణికి, ఫ్యూడల్ మనస్తత్వాలకు అద్దం పడుతున్నాయని పేర్కొంటూ, ఆ స్థాయిలోని వారే ఇలా మాట్లాడుతుంటే మిగిలిన వారి వైఖరి ఎలా ఉంటుందో ఆలోచించాలని జగన్ అన్నారు. కులరహిత సమాజ రూపకల్పన అనేది రాజ్యాంగ లక్ష్యాల్లో ఒకటని, అందుకోసం అనువైన వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని , ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి రాసిన లేఖల్లో కోరారు.