బాబు సర్కార్ పై పోరాటం ఉధృతం చేస్తాం

అనంతపురం :  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శకుని పాత్ర పోషించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. అనంతపురంలో వై.విశ్వేశ్వరరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నిరాశ కలిగించాయని చెప్పారు. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యల కంటే రాజకీయ లబ్ది కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. చంద్రబాబు సర్కార్పై పోరుబాటను మరింత ఉధృతం చేస్తామని విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.  
 

Back to Top