పేదలను దోచుకొని కార్పొరేట్ వర్గాలకు పెట్టడమే బాబు విధానంవైయస్ఆర్ సీపీ పాయకారావుపేట కోఆర్డినేటర్ గొల్ల బాబురావు
కాకినాడ: చంద్రబాబు వంచన, వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విశ్వసనీయతకు మధ్య పోరాటం జరుగుతుందని పాయకారావుపేట కోఆర్డినేటర్ గొల్ల బాబురావు అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితమే పేద ప్రజలను మోసం చేయడం ధనిక, కార్పొరేట్ వర్గాలకు దోచిపెట్టడమే అతని విధానమన్నారు. అన్ని వర్గాలను ద్రోహం చేశాడన్నారు. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అవహేళన చేస్తూ మాట్లాడారన్నారు. బడుగు, బలహీనవర్గాలకు ఇస్తీ్రపెట్టెలు, కత్తెరలు, వలలు ఇస్తూ మోసం చేస్తున్నాడన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబుకు ఏ బిరుదు ఇవ్వాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. మాట తప్పకుండా.. మడమ తిప్పకుండా దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలు ఇవాల్టికీ ప్రజల హృదయాల్లో సజీవంగా ఉన్నాయన్నారు. డూబ్లికేట్ టీడీపీ, డూబ్లికేట్ కాంగ్రెస్‌కు పుట్టిన బిడ్డ తెలుగు కాంగ్రెస్ అని దీన్ని ప్రజలంతా సముద్రంలో కలుపుతారన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా నవరత్నాలను అమలు చేసి రాజన్న రాజ్యం తీసుకొస్తారన్నారు.