అబద్దాల్లో ఆరితేరిన తండ్రీ కొడుకులు

()మోసాల్లో చంద్రబాబుది పీ హెచ్ డీ

()లోకేష్ బాబులాగే తయారయ్యాడు

()కడప కలెక్టరేట్ వద్ద వైయస్ జగన్ రైతు మహాధర్నా

()ప్రభుత్వం రాయలసీమకు చేస్తున్న అన్యాయంపై ఆగ్రహం

కడప)) అనేక రకాల అబద్దాలు ఆడుతున్న చంద్రబాబుని పిచ్చాసుపత్రిలో చేర్పించాలా లేక బంగాళాఖాతంలో పెట్టాలా అని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ నిలదీశారు. మోసాలు చేయటంలో బాబు పీ హెచ్ డీ చేశారని ఆయన ఎద్దేవా చేశారు.

రాయలసీమ ప్రజలకు తాగు, సాగునీటి అవసరాలు తీర్చాలని డిమాండ్ చేస్తూ వైయస్ జగన్ ఆధ్వర్యంలో రైతు మహా ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన రైతులు, రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్ని ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగించారు. వైయస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే...

() చంద్రబాబుకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఆయనకే తెలీటం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు ఏమీ చెప్పటం లేదట. అందుకే కరువు సంగతి తెలీటం లేదట.

() చంద్రబాబు మాత్రం చాలా గొప్పలు చెబుతుంటారు. సెల్ ఫోన్ తానే కనిపెట్టా అంటారు. కంప్యూటర్ ను కనిపెట్టా అంటారు. కానీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలీదట. ఆయన వద్ద ఉండే కోర్ డాష్ బోర్డును చూస్తే ప్రతీ జిల్లాలో ఎంత వర్షం పడిందీ, జూన్ లో ఎంత వచ్చింది. జూలైలో ఎంత పడిందీ అన్నది తెలుస్తుంది. ఆగస్టులో అసలు ఏమీ వానలు పడలేదన్నది అర్థం అవుతుంది

() చంద్రబాబుకి కరువు ఉన్నది అన్న సంగతి తెలియదా .. లేక వర్షాలు పడటం లేదన్న సంగతి తెలియటం లేదా.. ఏమనుకోవాలి. అసలే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు గాను కరువు తాండవిస్తూనే ఉంది.

() వాస్తవానికి కరువు వచ్చిందంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు క్యాబినెట్ సమావేశం నిర్వహించాలి. జూన్ లో వానలు పడ్డాయి. పంటలు వేశారు. జూలైలో కొద్దో గొప్పో వానలు కనిపించాయి. ఆగస్టులో అస్సలు లేదు. అటువంటప్పుడు క్యాబినెట్ మీటింగ్ పిలవాలి. రైతులకు ఎలా తోడుగా ఉండాలి.. ఎలా ఆదుకోవాలి అనే దాని మీద చర్చించాలి. కానీ క్యాబినెట్ సమావేశం పెట్టి సింగపూర్ కంపెనీలకు పొలాల్ని ఎలా కట్టబెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు.

() చంద్రబాబు పరిపాలన ఎలా ఉందంటే.. జూన్ లో ఖరీఫ్ సీజన్ మొదలైంది. రైతులకు బ్యాంకులు ఏమేర రుణాలు ఇస్తున్నాయో తెలుసుకోవాలి. ఇందుకోసం జూన్ 7న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. అందులో రైతులకు 36వేల కోట్ల రూపాయల క్రాప్ లోన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.  తర్వాత ఈ భేటీ ఆగస్టు 12న జరగాల్సి ఉంది. కానీ, జరగ లేదు. ఎందుకంటే సెప్టెంబర్ 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షాలు విరుచుకు పడతాయి అన్న భయంతో వాయిదా వేశారు. అప్పటికే బ్యాంకులు తమ వెబ్ సైట్లలో సమావేశం తేదీని ప్రకటించినప్పటికీ పట్టించుకోకుండా సెప్టెంబర్ లో ఈ భేటీ పెట్టుకొన్నారు. అంటే అప్పటికి ఖరీఫ్ సీజన్ పూర్తి అయిపోతుంది. అప్పుడు సమీక్ష చేసి ఏమి ఉపయోగం ఉంటుంది.

() మొన్నటికి మొన్న చంద్రబాబు వైయస్సార్ జిల్లా రాయచోటిక వచ్చారు. జిల్లాలో కరువు ఎంత ఉంది అన్న సంగతి తెలుసుకొనేందుకు ఏరియల్ సర్వే చేశారటం. వరదలు వస్తే నేల మీద వెళ్లలేరు కాబట్టి ఏరియల్ సర్వే చేస్తే ప్రయోజనం ఉంటుంది కానీ, గాలిలో హెలికాప్టర్ మీద వెళ్లి ఏరియల్ సర్వే చేస్తే లాభం ఏమిటి. నేను కరువు ప్రాంతాల్లో పర్యటించి పొలాలకు వెళ్లి రైతులతో కలిసి పొలాల్లో కూర్చొని పంట ను చూసి ఎంత మేర కరువు ఉందో పరిశీలించాను. అప్పుడు ఫలసాయం వస్తోందో లేదో చూస్తే కరువు అర్థం అవుతుంది. ఇటువంటి ముఖ్యమంత్రిని మాత్రం నేనెక్కడా చూడలేదు.

() కరవు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఏం చేయాలి.. నీటిపారుదల విభాగం ద్వారా  నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. శ్రీశైలం జలాశయంలో నీరు నిండుగా ఉన్నప్పడు కరెంట్ కోసం నీళ్లు ఎడా పెడా వదిలేస్తారు. ఇక్కడ కరువుతో రైతులు అల్లాడుతుంటే విద్యుత్ అవసరాల పేరుతో కిందకు వదిలేస్తున్నారు.

() కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు సడెన్ గా నిద్ర నుంచి మేలుకొంటారు. అప్పుడే కరువు అన్నది కనిపించనట్లుగా హడావుడి చేస్తారు. తాను ఎప్పుడు నిద్ర లేస్తే అప్పుడే తెల్లవారింది అని కొందరు అనుకొంటారు. అలా ఉంటుంది ఈయన గారి పరిస్థితి. తాను నిద్ర లేచిన తర్వాత వచ్చి కరువు గురించి మాట్లాడతారు. ఈవెంట్ మేనేజిమెంట్ టీమ్ ను రంగంలోకి దింపుతారు. ఈ టీమ్ ఏం చేస్తారు అంటే మభ్య పెట్టే పనులు చేస్తారు. వెంటనే రెయిన్ గన్  లు తెచ్చి కాలుస్తారు. కొత్తగా కనిపెట్టినట్లు చెబుతారు. నాయనతో పాటు వాకింగ్ కు వెళ్లేవాళ్లం పొలం వెంబడి. అప్పుడే 11 సంవత్సరాల క్రితమే రెయిన్ గన్ లు ఉపయోగించాం. రెయిన్ గన్లు, స్పింకర్లు, డ్రిప్ లు అన్నది ఇక్కడ వాళ్లకు కొత్తేమీ కాదు. చెవుల్లో పూలు పెట్టుకొన్నట్లు, కాలీఫ్లవర్  లు పెట్టుకొన్నట్లుగానూ ప్రజలు ఆయనకు కనిపిస్తారు. దీంతో ఆయన అలా మాట్లాడుతారు.

() రెయిన్ గన్ తో నీళ్లు కొట్టిస్తాను అంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది. మొన్న పులివెందుల మండలంలో పర్యటించాను. వ్యవసాయాధికారిని అడిగితే 1,440 హెక్టార్లు అంటే దాదాపు 4వేల ఎకరాల్లో వేరుశనగ సాగు అవుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఎన్ని రెయిన్ గన్ లు పంపించింది అంటే 4 రెయిన్ గన్ లు పంపించిందంట. ఎక్కడ 4 వేల ఎకరాలు, ఎక్కడ 4 రెయిన్ గన్ లు.

() చంద్రబాబు పరిపాలన ఎలా ఉంటుందంటే.. ఎవరైనా జ్వరంతో బాధ పడుతూ మూర్చిల్లి పోతే మనం ఏం చేస్తాం. ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తాం. కానీ చంద్రబాబు మాత్రం సదరు వ్యక్తి ముఖం మీద నీళ్లు చల్లి మనిషి లేచాడు, జ్వరం పోయింది అని చెబుతున్నాడు. ఇంత దారుణమైన ఈవెంట్ మేనేజిమెంట్ ఎక్కడ చూడలేదు. ఇటువంటి మనిషిని ఏమనాలి.

() ఇవాళ ఒకసారి మన ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టుల సంగతి చూద్దాం. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో ఎలా ఉన్నాయి. ఆయన తర్వాత పాలకులు పట్టించుకోక పోవటం వల్ల ఎలా అయ్యాయి అన్నది తెలుస్తోంది.

() 2014 లో చంద్రబాబు గండికోటకు వచ్చారు. 2015 కి అల్లా 10 టీఎమ్ సీల వాటర్ ఇస్తా అని చెప్పారు. 2015 అయిపోయింది. 2016 కూడా అయిపోవస్తోంది. కానీ ఏమీ ముందుకు సాగటం లేదు. ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలు తీర్చనే లేదు. కామన్ సెన్స్ ఉంటే ప్రజలందరికీ ఒకటి అర్థం అవుతుంది.

ప్రాజెక్టు పూర్తి  చేయాలంటే పెండింగ్ లో ఉన్న సమస్యలు తీర్చాలి. వరద కాల్వలు పూర్తి చేయాలి. దివంగత మహానేత వైయస్సార్ హయంలో80శాతం పనులు పూర్తి అయ్యాయి. రెండున్నరేళ్లు అవుతున్నా 20 శాతం పనులు పూర్తి చేయలేకపోయారు. పెండింగ్ పనులు పూర్తి చేయకుండా 10 టీ ఎమ్ సీ ల నీటి సరఫరా ఎలా సాధ్యం

() తెలుగు గంగను చూద్దాం. అక్కడ నుంచి బ్రహ్మం సాగర్ కు 12 టీ ఎమ్ సీ ల నీటిని ఇస్తా అంటున్నారు. వాస్తవానికి చాలా వరకు పనులు పూర్తి అయ్యాయి కాబట్టి పెద్ద గా కష్టం ఏమీ కాదు. ప్రతీ సారీ ఆ మాట చెబుతారు. కానీ రెండున్నరేళ్లుగా ఒక్క టీఎమ్ సీ కూడా ఇవ్వలేదు. 2014 లో శ్రీశైలంలో నీరు నిండి పొర్లిపోతున్నా పట్టించుకోలేదు. మూడు సార్లు పొర్లి పోతుంటే కిందకు విడిచి పెట్టారు. 92 టీ ఎమ్ సీ ల నీరు కిందకు పోయింది. బ్రహ్మం సాగర్ విషయం మాత్రం పట్టించుకోలేదు.

() ఇన్ని అబద్దాలు ఆడుతున్న మనిషిని ఏమనాలి. ఇటువంటి మనిషిని ఎక్కడ పెట్టాలి. పిచ్చాసుపత్రిలోనా.. లేకపోతే బంగాళాఖాతంలో వేయాలా .. నోరు తెరిస్తే అబద్దాలు.. చేసేదంతా మోసాలు

() బ్రహ్మం సాగర్ నుంచి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకి నీళ్లు రావాలి. అక్కడ నుంచి నీళ్లు రాకపోతే ఇక్కడ కరెంట్ పుట్టదు. అటువంటప్పుడు ఆర్ టీ పీ పీ మూతపడుతుంది. అయినా సరే, చంద్రబాబుకి సంతోషమే. ఆ ప్రాజెక్టుని కూడా సింగపూర్ కంపెనీలకు అమ్మేసుకోవచ్చని ప్రయత్నం.

() రాయలసీమ ప్రాజెక్టులకు చేసిన కేటాయింపుల్ని చూస్తే చంద్రబాబు చిత్త శుద్ధి అర్థం అవుతుంది. గాలేరు నగరి సుజల స్రవంతి కి 13 కోట్లు, హంద్రీనీవా కు 17 కోట్లు, వెలుగోడుకి 13 కోట్లు కేటాయిచాంరు. చంద్రబాబు తర్వాత కాలంలో దివంగత మహానేత వైయస్సార్ పదవిలోకి వచ్చారు కాబట్టి వాటికి విరివిగా నిధులు ఇచ్చి దాదాపు 80 శాతం మేర పనులు పూర్తి చేశారు. కాస్తో కూస్తో నీళ్లు వస్తున్నాయంటే ఆ దివంగత మహానేత చలవే అనుకోవాలి.

() ఇదే చంద్రబాబు హంద్రీనీవా గురించి మాట్లాడుతారు. అనంతపురం జిల్లా అంటే బాగా అభిమానం అక్కడ నుంచే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు అంటారు. ప్రజల్ని వెర్రివాళ్లుగా భావిస్తున్నారా లేక చెవిలో పువ్వులు పెట్టి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా..

() సొంత మామ ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ప్రజల్ని వెన్నుపోటు పొడవటం పెద్ద కష్టమేమీ కాదు

() రైతుల్ని మోసం చేయటంలో చంద్రబాబు పీ హెచ్ డీ తీసుకొన్నారు. అదే విషయాన్ని ఆయన కుమారుడికి కూడా నేర్పుతున్నారు. నారా లోకేష్ కడప కు వచ్చి స్టీల్ ఫ్యాక్టరీ అంటారు. ఎవరైనా కానీ పిల్లలకు ఏం చెబుతారు. మంచి పద్దతులు నేర్పుతారు. అబద్దాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు. గౌరవంగా బతకాలి అని నేర్పిస్తారు. పిల్లలు కాపీ కొట్టకూడదు, మంచి పనులు చేయాలి, మోసం చేయకూడదు అనేవి నేర్పిస్తారు.

() చంద్రబాబు మాత్రం కొడుక్కి మోసాలు చేయటం నేర్పిస్తున్నారు. రైతుల్ని ఎలా మోసం చేయాలి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పారు. ఆ విధంగా రైతుల్ని ఎలా మోసం చేయాలి అనేది నేర్పించారు. మరో అబద్దం ఆడితే అంటే బ్యాంకుల్లో రుణాలు మాఫీ అవటంతో పాటు బంగారం ఇంటికి రావాలి అంటే బాబు సీఎం కావాలి అంటూ మరో అబద్దం నేర్పించారు.

() రైతుల్ని మాత్రమే కాదు, మహిళల్ని ఎలా మోసం చేయాలో కూడా నేర్పిస్తున్నారు. ఆడవాళ్లని కూడా వదిలిపెట్టలేదు. డ్వాక్రా సంఘాలు తీసుకొన్న రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తాం అని చెప్పి మోసం చేశారు. చిన్నపిల్లల జోలికి సాధారణంగా పోరు. ఎందుకంటే తేడా వస్తే పిల్లలు, చదువుకొంటున్న పిల్లలు తిడతారు. ఆ ఉసురు మనకు ఎందుకులే అని దూరంగా ఉంటారు. కానీ చంద్రబాబు వారినీ విడిచిపెట్టలేదు. పూర్తిగా మోసం చేశారు.

() చివరకు పరిస్థితి ఎంత వరకు వెళ్లిందంటే.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొనేందుకు రక రకాల అబద్దాలు చెప్పారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొన్నాక కూడా అబద్దాలు కొనసాగిస్తున్నారు.

() చంద్రబాబు గురించి నాలుగు ముక్కలు చెప్పాలంటే.. అబద్దం.. మోసం. దుర్మార్గం.. వెన్నుపోటు

() చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకోవాలని, ప్రజల తరపున కొన్ని డిమాండ్లు చేస్తున్నాం

1.     కేసీ కెనాల్ కు జనవరి 15 దాకా నీటిని విడుదల చేసి ఆయకట్టుని రక్షించాలి.

2.     ముంపు ప్రాంతాల సమస్యలు పరిష్కరించనిదే గండికోట పనులు పూర్తి కావు. అందుచేత నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి నీళ్లు ఇవ్వాలి

3.     చిత్రావతి పనులు దివంగత మహానేత వైయస్సార్ హయంలోనే 90 శాతం దాకా పూర్తి అయ్యాయి. రెండున్నరేళ్లలో 10 శాతం కూడా పూర్తి చేయలేదు. ఇటువంటి వ్యక్తా ముఖ్యమంత్రి అనిపిస్తుంది. ఇప్పటికైనా ఆ పనులు పూర్తి చేయాలి.

4.     తెలుగు గంగ ద్వారా బ్రహ్మం సాగర్ కు నీళ్లు ఇప్పించాలి.

5.     తెలుగు గంగా, హంద్రీ నీవా పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.

6.     దివంగత మహానేత వైయస్సార్ హయంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు పనులు వేగవంతంగా ముందుకెళ్లాయి. ఈ ఫ్యాక్టరీ  ఏర్పాటయితే ఈ ప్రాంతంలో యువకులకు 10వేల దాకా ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. కానీ చంద్రబాబుకి మాత్రం ఆ ధ్యాసే లేకుండా పోయింది.

7.     ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ముందడుగు వేయకపోతే పరిస్థితి అంతే తీవ్రంగా ఉంటుందని తెలియచేస్తున్నాం

8.     చంద్రబాబు మీద ఈ పోరాటాన్ని ఆపడం లేదు. మరింత ఉధ్రతంగా పోరాడుతాం. 

Back to Top