చంద్ర‌బాబు పాపాలు.. 632 మ‌ర‌ణాలు


హైద‌రాబాద్ ) కేంద్రం విడుద‌ల చేసిన గ‌ణాంకాల ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 632 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకొన్నారు. తెలంగాణ లో ఈ సంఖ్య ఇంత‌కు మించి నిలిచింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ప్ర‌చారం లో రైతుల‌కు రుణ‌మాఫీ చేస్తాన‌ని పదే ప‌దే హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వ‌చ్చాక ఆ హామీల‌ను గాలికి వ‌దిలేశారు. దీంతో అటు పాత అప్పులు తీర‌క‌, కొత్త అప్పులు పుట్ట‌క ప‌దే ప‌దే రైతులు అప్పుల ఊబిలో కూరుకొని పోయారు. కొంత‌మంది రైతులు నిస్పృహ‌తో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకొన్నారంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. మొద‌ట్లో అస‌లు రైతుల ఆత్మ‌హ‌త్య‌లే లేవ‌ని బుకాయించిన ప్ర‌భుత్వం, త‌ర్వాత అక్క‌డ‌క్క‌డ ఆత్మ‌హ‌త్య‌లు జ‌రుగుతున్నాయ‌ని చెప్పుకొ్చ్చింది. ఇప్పుడు కేంద్ర గ‌ణాంకాల ప్ర‌కార‌మే 632 మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకొన్నారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. 
Back to Top