వైయస్‌ఆర్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు



విజయనగరంః  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు ఓ వైపు తిరుగులేని ప్రజాదరణ లభిస్తుంటే.. మరోవైపు, ఈ సంకల్పంలో మేమూ భాగస్వాములమవుతాం అంటూ రాజకీయ సీనియర్‌ నేతలు పెద్దఎత్తున ముందుకు వస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వస్తున్న వారు కొందరైతే, ఏ రాజకీయ పార్టీలకూ సంబంధం లేకుండా జనజీవితంతో మమేకమై ఉన్న వారు మరికొందరు.  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వ పటిమపై నమ్మకంతో  మాజీ ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు వైయ‌స్ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.  ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

రిటైర్డు అధికారుల చేరిక‌లు
వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభ‌మైన నాటి నుంచి వైయ‌స్ఆర్‌సీపీలోకి వ‌ల‌స‌లు వెల్లువెత్తున్నాయి. మాజీ ఐపీఎస్‌ అధికారి, రిటైర్డు డీఐజీ మహ్మద్‌ ఇక్బాల్‌ పశ్చిమగోదావరి జిల్లాలో జగన్‌ను కలిసి పార్టీలో చేరారు. ఇక్బాల్‌ ఒకప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యక్తిగత భద్రతాధికారిగా వ్యవహరించారు. కడప జిల్లాకు చెందిన మరో ఐపీఎస్‌ మాజీ అధికారి ఎస్‌.లక్ష్మీరెడ్డి కూడా పార్టీలో చేరారు.   మాజీ డీఐజీ ఏసురత్నం, పాయకరావుపేటకు చెందిన విజిలెన్స్‌ రిటైర్డు ఎస్పీ యజ్జల ప్రేమ్‌బాబు విశాఖ యాత్రలో పార్టీలో చేరారు. డీఆర్‌డీఏ పీడీగా ఉన్న తలారి రంగయ్య,  గతంలో ఐఆర్‌ఎస్‌ అధికారిగా పనిచేసిన కడపల శ్రీకాంత్‌రెడ్డి, విశ్రాంత న్యాయమూర్తి ఎం.క్రిష్ణప్ప పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

రాజకీయ చేరికలు
కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రాజా కన్నబాబు, కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి వివిధ ప్రాంతాల్లో జగన్‌ను కలుసుకుని పార్టీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు చెరుకువాడ రంగనాథరాజు, మద్దాల సునీత, మోచర్ల జవహర్‌వతిలు జగన్‌ తమ జిల్లా పర్యటనలో ఉండగానే పార్టీలో చేరారు. అదే విధంగా మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణప్రసాద్‌ కూడా పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి కూడా పార్టీలో చేరారు. 

అనంతపురం జిల్లాలో ఎంపీ జేసీ దివాకర్‌రెడి ప్రధాన అనుచరుడు కోగటం విజయభాస్కర్‌రెడ్డి పార్టీలో చేరారు. గుంటూరుకు చెందిన వైశ్య ప్రముఖుడు పాదర్తి రమేష్‌ గాంధీ, సత్తెనపల్లె టీడీపీలో యాదవ నేత నిమ్మకాయల రాజనారాయణ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆతుకూరి సత్యనారాయణ, గురజాల టీడీపీ నేత ఎనుముల మురళీధర్‌రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో  చేరారు. వీరేకాక.. పాదయాత్రలో దారిపొడవునా పెద్ద సంఖ్యలో సర్పంచ్‌లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్‌ , వివిధ సామాజిక వర్గాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు. నెల్లూరుకు చెందిన మాజీ ముఖ్యమంత్రి దివంగత నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన మాజీమంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి కూడా వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  

తాజా వీడియోలు

Back to Top