మాజీ మంత్రి వసంత కుటుంబం వైయస్‌ఆర్‌సీపీలో చేరిక



– వైయస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్న మైలవరం టీడీపీ నేతలు  
కృష్ణా జిల్లా: రాష్ట్ర రాజధాని కేంద్రమైన కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. గత నెల 14వ తేదీ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైయస్‌జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరగా ఇవాళ మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు, ఆయన తనయుడు టీడీపీ నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్‌ వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని పెరికెగూడెం వద్ద కృష్ణప్రసాద్‌ కలిసి అధినేత సమక్షంలో పార్టీలో చేరారు. కృష్ణ ప్రసాద్‌మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు. ఆయనతో పాటు వందలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. 

వైయస్‌ఆర్‌ హయాంలో పేదల సంక్షేమానికి పెద్ద పీఠ: కృష్ణ ప్రసాద్‌
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. ఆయన బాటలోనే వైయస్‌ జగన్‌ పయనిస్తున్నారని, మహానేత మాదిరిగా ఆయన కూడా ప్రజలకు మంచి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో కృష్ణా జిల్లాలోని పార్థసారధి, ఉదయభాను, వెల్లంపల్లి శ్రీనివాస్‌ అందరం కలిసి సమష్టిగా పని చేసి జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, టీడీపీ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందన్నారు. వైయస్‌ జగన్‌ ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటారని ప్రజలు నమ్ముతున్నారన్నారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలని వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని చెప్పారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం తధ్యమని, ప్రజలందరూ అఖండ మెజారిటీ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉంది: వసంత నాగేశ్వరరావు
తన కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్‌ వైయస్‌ఆర్‌సీపీలో చేరడం ఆనందంగా ఉందని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు పేర్కొన్నారు.  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డితో మా కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ప్రజల కోసం వైయస్‌ఆర్‌సీపీ కృషి చేస్తుందన్నారు. మహానేత పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. జగన్‌ ద్వారా వైయస్‌ఆర్‌ పాలన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


 
Back to Top