వైయస్‌ఆర్‌సీపీలో చేరిన మాజీ మంత్రి మహిధర్‌రెడ్డితూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వివిధ పార్టీల నాయకులు ఆకర్శితులవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి మహిధర్‌రెడ్డి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను మహిధర్‌రెడ్డి కలిసి పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నడంతో ఆయనకు జననేత పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహిధర్‌రెడ్డి మాట్లాడుతూ..వైయస్‌ఆర్‌సీపీ సిద్ధాంతాలకు ఆకర్శితుడినై పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కాకుండా తన అభివృద్ధినే చంద్రబాబు కోరుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితిలో ఉందని ఆయన పేర్కొన్నారు. 
 
Back to Top