వైయస్సార్సీపీలో చేరిన మాజీ మంత్రి

హైద‌రాబాద్‌: తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన‌ మాజీ మంత్రి, పిఠాపురం కాంగ్రెస్ నాయ‌కుడు కేవీసీహెచ్ మోహ‌న్‌రావు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో ఆయ‌న వైయ‌స్ఆర్‌సీపీలో చేర‌గా, మోహ‌న్‌రావుకు వైయ‌స్ జ‌గ‌న్ కండువా క‌ప్పి సాదారంగా పార్టీలోకి ఆహ్వానించారు. మోహ‌న్‌రావు స్వ‌ర్గీయ కోట్ల విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి హ‌యాంలో అట‌వీ శాఖ మంత్రిగా ప‌నిచేశారు.  

Back to Top