ఎన్నికలకోసం బీసీలు ఎదురుచూస్తున్నారు

తెనాలి 22 మార్చి 2013:

ఫీజు రీయింబర్సుమెంటు వల్ల లబ్ధి పొందింది బడుగు బలహీనవర్గాలేనని గుంటూరు జిల్లాకు చెందిన గౌరీపట్నం వాసుదేవరావు పేర్కొన్నారు. వారంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే నడుస్తారని ఆయన స్పష్టంచేశారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టిన శ్రీమతి షర్మిలను ఆయన శుక్రవారం కలిశారు. ఆయన టీడీపీ కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం కార్యదర్శి కూడా అయిన వాసుదేవరావు పాదయాత్రలో మాట్లాడుతూ, ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. తమ హయాంలో బీసీలకు న్యాయం చేశామని చంద్రబాబు చెబుతున్న మాట అవాస్తవమని తెలిపారు. రాజశేఖరరెడ్డిగారు కొద్ది రోజులకు చనిపోతారనగా బీసీలలోని 115 కులాలలో 15 కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటుచేశారన్నారు. ఆ జీవోలను కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టిందనీ, కల్లబొల్లి కబుర్లు చెబుతూ ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. బడుగు, బలహీన, మైనార్టీలు ఎన్నికలు ఎప్పుడొస్తాయా.. జగన్మోహన్ రెడ్డిగారిని ఎప్పుడు ముఖ్యమంత్రిగా చూస్తామా అని ఎదురుచూస్తున్నారన్నారు.

Back to Top