ఇది చేతకాని ప్రభుత్వం...కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

ధర్మవరం : చంద్రబాబుది చేతకాని ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే చేనేతలకు భరోసా కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి కొడుకు పెళ్లి పనుల్లో ఉన్న అధికారులు ఇక్కడ చేనేతలు దీక్షా చేస్తున్నా పట్టించుకోలేదని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన జీవోలు నాలుక గీచుకోవడానికి కూడా పనికి రావడం లేదన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అబద్ధాలు ఆడటం దారుణమన్నారు. ఏ అధికారి కూడా చేనేతల గురించి ఆలోచించడం లేదు. చేనేత కార్మికుడు తిరుగబడే రోజు వచ్చిందని హెచ్చరించారు. జిల్లాలో 85 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలకు వైయస్‌ జగన్‌ ఇచ్చిన ఆర్థికసాయం తప్ప ప్రభుత్వం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 50 ఏళ్లకే పింఛన్‌ ఇప్పించే ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జన్మభూమి కమిటీలకు అధికారాలు కట్టబెట్టడంతో అర్హులకు సంక్షేమపథకాలు అందడం లేదన్నారు. వైయస్‌ జగన్‌ రోడ్డుపైకి వచ్చి ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. చేనేతలను మోసం చేసింది చంద్రబాబే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత మందికి రుణాలు ఇచ్చారని ప్రశ్నించారు. వారిని ఆదుకోవాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని ఫైర్‌ అయ్యారు. పది వేల కుటుంబాలు బెంగుళూరు వంటి నగరాలకు వలస వెళ్లి దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీని టీడీపీ నేతల జెబుల్లోకి తీసుకెళ్తున్నారని విమర్శించారు. ఏ ఇంట్లో వారు సంతృప్తిగా ఉన్నారో చూపాలని నిలదీశారు.

Back to Top