కంచనపల్లిలో మహానేత విగ్రహం ఆవిష్కరణ

వరంగల్, 3 జూలై 2013:

వరంగల్‌ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో ఏర్పాటు చేసిన మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని శ్రీమతి వైయస్‌ విజయమ్మ బుధవారం ఉదయం ఆవిష్కరించారు. వరంగల్‌ జిల్లా పర్యటనకు వస్తున్న శ్రీమతి విజయమ్మ మార్గమధ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట పార్టీ నేతలు కొండా సురేఖ దంపతులు కూడా ఉన్నారు.

కాగా, మధ్యాహ్నం వరంగల్‌లోని అభిరాం గార్డెన్సులో జరిగే పార్టీ జిల్లా స్థాయి పంచాయతీరాజ్ సదస్సులో శ్రీమతి విజయమ్మ పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు డోర్నకల్‌ నియోజకవర్గంలోని మరిపెడ వద్ద జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి శ్రీమతి విజయమ్మ ప్రసంగిస్తారు. శ్రీమతి విజయమ్మ జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆమెకు ఘనస్వాగతం పలుకుతూ ప్రధాన సెంటర్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.

తాజా వీడియోలు

Back to Top