పాలతోడులో గడప గడపకూ వైయ‌స్ఆర్‌

తూర్పు గోదావ‌రి: మండపేట మండ‌లం పాల‌తోడు గ్రామంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు పార్టీ  నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి తెలిపారు. మధ్యాహ్నం 1గంట నుంచి పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు), రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాధరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు సత్తి వెంకటరెడ్డి, పెంకే వెంకట్రావు తదితరులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి స్థానికుల సమస్యలు తెలుసుకుంటామన్నారు. అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పట్టాభిరామయ్య చౌదరి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. 

Back to Top