వైయస్‌ జగన్‌కు వైద్య పరీక్షలుహైదరాబాద్‌: విశాఖ ఎయిర్‌ పోర్టులో హత్యాయత్నానికి గురైన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రి వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. గత నెల 25వ తేదీ విశాఖ ఎయిర్‌పోర్టులో వైయస్‌ జగన్‌పై శ్రీనివాసరావు అనే యువకుడు సెల్ఫీ తీసుకునేందుకు వచ్చి కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో హత్యాయత్నానికి పాల్పడగా త్రుటీలో వైయస్‌ జగన్‌ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ తరువాత హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు శస్త్ర చికిత్సలు చేశారు. కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని చెప్పడంతో జననేత రెస్టు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మరోమారు వైద్యులు వైయస్‌ జగన్‌ను పరీక్షిస్తున్నారు.
 
Back to Top