ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దు

విశాఖ: రాజకీయ ప్రోద్భలంతో కేసులు పెట్టి ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. పొలిటికల్‌ పంచ్‌ అడ్మిన్‌ ఇంటూరి రవికిరణ్‌పై పెట్టిన కేసును టీడీపీ ఎమ్మెల్యే అనిత పునరాలోచించుకోవాలని సూచించారు. రవికిరణ్‌ పెట్టిన కార్టూన్‌లో ఎక్కడా ఆమెను కించపరిచే విధంగా లేదన్నారు. ఎమ్మెల్యే అనిత నిజంగా బాధపడివుంటే దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబుపై కేసు పెట్టాలని, యావత్‌ దళిత జాతిని అవమానించేలా చంద్రబాబు మాట్లాడారన్నారు. చంద్రబాబుపై కేసు పెడితే దళిత జాతి హర్షిస్తుందన్నారు. అనితకు సోదరుడిగా సూచన మాత్రమే చేస్తున్నారని గొల్ల బాబురావు స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top