బాబు మాయమాటలకు మోసపోవద్దు

నంద్యాలలో ఎక్కడ చూసినా ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనబడుతోందని నంద్యాల వైయస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. వైయస్సార్సీపీ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. గతంలో నంద్యాల అభివృద్ధి కోసం తాను ఎన్ని విజ్ఞాపనలు ఇచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదని, మీరే ఖర్చుపెట్టుకోండంటూ మాట్లాడారని శిల్పా ఫైర్ అయ్యారు. ఇప్పుడు నంద్యాల ఉపఎన్నిక రాగానే రూ. 1200కోట్ల హామీలంటూ  చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఖర్చు చేయకపోయినా చేసినట్టు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. బాబు మాయమాటలకు మోసపోవద్దని  ప్రజలకు సూచించారు. నంద్యాలలో ఎలక్షన్లు అయిపోక బాబు, మంత్రులు ఎవరూ కనిపించరని ఎద్దేవా చేశారు. 

Back to Top