20 నిమిషాల్లో ఆధారాలు చూపిస్తాం

వెలగపూడి: అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. 20 నిమిషాల సమయం ఇస్తే ఆధారాలతో సహా చూపిస్తామని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. జ్యుడిషియల్‌ ఎంక్వైరీని వైయస్‌ఆర్‌ సీపీ డిమాండ్‌ చేస్తే టీడీపీ సభ్యులు వాళ్లేదో ఇచ్చినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని వైయస్ జగన్ మండిపడ్డారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై ఆధారాలతో సహా చూపిస్తామంటే ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు. 20 నిమిషాలు అవకాశం ఇస్తే సాక్షాధారాలతో సహా సభకు చూపిస్తా.. ఒక వేళ మైక్‌ ఇవ్వకపోతే.. ఆధారాలతో సహా ప్రెస్‌ముందుకు వెళతానని వైయస్ జగన్ అన్నారు. 
Back to Top