దిగ‌జారి వ్య‌వ‌హ‌రిస్తారా..!


హైద‌రాబాద్ ) రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్ర‌భుత్వం దిగజారి వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మాజీమంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద్ రావు ఆరోపించారు. హైద‌రాబాద్ లోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతోమాట్లాడారు. ఇసుక మాఫియా కేసులో ప్ర‌భుత్వం త‌ర‌పున వ్య‌వ‌హ‌రించిన త‌హ‌శీల్దార్ వ‌న‌జాక్షిని క్యాబినెట్ త‌ప్పు ప‌ట్ట‌డాన్ని ఆయ‌న ఖండించారు. ఏ విధంగా ఆమెది త‌ప్ప‌ని నిర్ణ‌యిస్తార‌ని ఆయ‌న అన్నారు. అస‌లు ఈ వ్య‌వ‌హారంలో ద‌ర్యాప్తు జ‌ర‌గ‌కుండానే ఈ విధ‌మైన నిర్ణ‌యం ఎలా తీసుకొంటార‌ని ధ‌ర్మాన అన్నారు. చంద్ర‌బాబు పాల‌న రోజు రోజుకి దిగ‌జారి పోతోంద‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. అనుభ‌వ‌జ్జుడ్ని అని చెప్పుకొని ప‌ద‌విలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు, ఇప్పుడు దిగ‌జారిపోయి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ధ‌ర్మాన విమ‌ర్శించారు.
----------------

Back to Top