పూలే ఆశయసాధన కోసం పునరంకితం

తిరుపతిః వైఎస్సార్సీపీ నేతలు తిరుపతిలో జ్యోతిరావు పూలే వర్థంతిని
ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి
నివాళులర్పించారు. బడుగు వర్గాల క్షేమాన్ని జయంగా పెట్టుకొని పోరాడిన
మహానాయకుడు పూలే అని భూమన కరుణాకర్ రెడ్డి కొనియాడారు. ఆమహనీయుని ఆలోచనను
ఆదర్శంగా తీసుకొని సమాజంలోని కుళ్లుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత
ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. 

దివంగత ముఖ్యమంత్రి
వైఎస్. రాజశేఖర్ రెడ్డి జ్యోతిరావు పూలే ఆశయసాధనకు ఆకర్షితులై... ఆనాడు
సెలవు దినంగా ప్రకటించిన విషయాన్ని కరుణాకర్ రెడ్డి ఈసందర్భంగా
గుర్తించారు. వైఎస్సార్సీపీ అణగారిన ప్రజల పక్షాన పోరాడుతుందని భూమన
స్పష్టం చేశారు. ఆయన ఆశయ సాధన కోసం పునరంకితం అవుతామన్నారు. 
Back to Top