ద‌ళితుల్ని అణ‌చివేస్తున్న ప్ర‌భుత్వం

హైద‌రాబాద్‌ : రాష్ట్ర ప్ర‌భుత్వం ద‌ళితుల్ని తీవ్రంగా అణ‌చివేస్తోంద‌ని
పార్టీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. జీవో నెం. 23
లోని సెక్ష‌న్ 11డీ ని వెంట‌నే స‌వ‌రించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఎస్సీ,
ఎస్టీ ఉప ప్ర‌ణాళిక నిధుల్ని ప‌క్క దోవ ప‌ట్టిస్తున్నార‌ని ఆయ‌న
విమ‌ర్శించారు. ఇది ద‌ళితుల హ‌క్కుల్ని కాల‌రాసే జీవో అని ఆయ‌న
అభివ‌ర్ణించారు. ఈ ప్ర‌భుత్వం ఎస్సీ, ఎస్టీల‌కు తీవ్ర అన్యాయం చేస్తోంద‌ని
నాగార్జున అన్నారు. అయిన‌ప్ప‌టికీ టీడీపీ లోని ద‌ళిత మంత్రులు క‌ళ్లు లేని
క‌బోదుల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న మండి ప‌డ్డారు. ఈ నెల 24న పార్టీ
ఎస్సీ సెల్ ఆధ్వ‌ర్యంలో అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ ల‌కు మెమోరాండం ఇస్తామ‌ని
ఆయ‌న తెలిపారు.

Back to Top