దేవినేని ఉమది పిచ్చివాగుడు: సామినేని

నందిగామ (కృష్ణాజిల్లా) : శ్రీమతి షర్మిల పాదయాత్రకు వస్తున్న అశేష జన స్పందన చూసి పిచ్చెక్కిపోయి టిడిపి జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కృష్ణాజిల్లా జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను విమర్శించారు. నందిగామ జిడిఎంఎం కళాశాలలో ఆదివారం జరిగిన నందిగామ, తిరువూరు నియోజకవర్గాల వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకుల సమీక్షా సమావేశానికి ఉదయభాను అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పార్టీ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. నందిగామ, తిరువూరు నియోజకవర్గాల నుంచి 200 మంది ముఖ్య నాయకులు పాల్గొని పార్టీ పనితీరుపై సమీక్షించారు.

అనంతరం ఉదయభాను విలేకరులతో మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాకు‌ మహానేత డాక్టర్ వైయస్ ఏం చేశారని దేవినేని ఉమ మాట్లాడటం ఆయన రాజకీయ పరిణితి‌కి అద్దం పడుతోందన్నారు. కృష్ణా జిల్లాకు ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు, ట్రిపుల్ఐ‌టి, యూనివర్సిటీ, ఎత్తిపోతల పథకాలు, పులిచింతల ప్రాజెక్టు వంటి వాటిని ప్రారంభించిన ఘనత వైయస్‌దే అని తెలుసుకోవాలన్నారు. నందిగామలో అక్రమ ఇసుక క్వారీలకు, కొండగుట్టలకు, లిక్కర్ సిండికేట్లకు నాంది పలికింది ఉమ అని ఆరోపించారు.

మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ నాయకుడు వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ‌. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఓ ఊసరవెల్లి అని, స్వార్థం కోసం ఎవరితోనైనా చేతులు కలుపుతారని విమర్శించారు. నీతి, నిజాయితీలున్న మహానేత వైయస్ కుటుంబాన్ని విమర్శించే స్థాయి, అర్హత ఆయనకు లేవన్నారు.‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి నిర్దోషిగా బయటకొస్తారని, ఆనం మాత్రం ప్రజల చేతిలో ఉరి వేయించుకుని రాజకీయాల నుంచి దూరమవుతారని అన్నారు.
Back to Top