దాడులను ఉపేక్షించం: గట్టు

హైదరాబాద్:

టీఆర్‌ఎస్ దాడులను ఉపేక్షించబోమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తెలిసారు. మంగళవారమిక్కడి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.  తమ పార్టీ కార్యాలయాలు, కార్యకర్తలపై టీఆర్‌ఎస్ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణవాదులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారన్నారు. ఒక రాజకీయ పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన చేయడం, ఇతర పార్టీల నేతలను తెలంగాణలో తిరగనీయబోమంటూ రెచ్చగొట్టడం టీఆర్‌ఎస్‌ సంస్కృతన్నారు.  కేసీఆర్ వాడే పదజాలానికి 20 సార్లు దాడులు చేసి ఉండాలి. కానీ మాది ఆ సంస్కృతి కాదని స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్ తన వైఖరి మార్చుకోకపోతే తామూ ప్రతిఘటనకు దిగుతామని పార్టీ మైనారిటీ విభాగం కన్వీనర్ హెచ్.ఎ.రెహ్మాన్ హెచ్చరించారు. ఎక్కడో విజయనగరంలో పుట్టిన కేసీఆర్ ఇపుడు ఇక్కడకు వచ్చి తెలంగాణకు తానే గుత్తేదారునని అంటే ఏ మాత్రం చెల్లదని స్పష్టంచేశారు.

Back to Top