జీతాలు అడిగితే అంగన్‌వాడీలను అరెస్ట్‌ చేస్తారా

హైదరాబాద్: గ్రామ సేవకులు, అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు. మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్న గ్రామ సేవకులు తమ గోడును ప్రభుత్వానికి చెప్పుకోవడానికి చలో అసెంబ్లీ తలపెడితే అన్యాయంగా అరెస్ట్ చేశారని సభ దృష్టికి తెచ్చారు. వారి అరెస్ట్‌లను  ఖండిస్తూ దీనిపై హోం మంత్రి తక్షణమే ప్రకటన చేయాలని కోరారు.  వేతనాల జీవోను మార్చడం వల్ల వీఆర్‌ఏలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అసెంబ్లీ ముట్టడి తలపెడితే 3వేల మందిని అరెస్ట్ చేసి జైళ్లకు తరలించటం భావ్యం కాదన్నారు.
Back to Top