వైయస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ నేత

హైదరాబాద్ః కాంగ్రెస్ నేత పీజేఆర్ సుధాకర్ బాబు వైయస్సార్సీపీలో చేరారు. సుధాకర్ బాబు, ఆయన అనుచరులు వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో లోటస్ పాండ్ లో పార్టీలో చేరారు. వీరికి వైయస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.  కాగా, సుధాకర్ బాబు గతంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.


వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు
అట్టడుగు వర్గంలో పుట్టినవాడిని, రాజకీయాల్లో ఓనమాలు తెలియని తాను ఈ స్థాయికి వచ్చానంటే అది వైయస్ఆర్ కుటుంబం వల్లేనని సుధాకర్ బాబు అన్నారు. సమాజం పట్ల బాధ్యత గల యువకులు, ప్రతిభ, రాజకీయ చైతన్యం ఎక్కడ ఉంటే అక్కడ వైయస్ఆర్ కుటుంబం చూపు ఉంటుందని అన్నారు. నాలాంటి వారెందరికో ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ఆర్ కుటుంబం రాజకీయ జీవితం ప్రసాదించిందని అన్నారు. తాను వైయస్సార్సీపీలో లేటుగా చేరినందుకు మథనపడుతున్నానన్నారు. ఎక్కడికెళ్లినా వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని సుధాకర్ బాబు చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top