చంద్రబాబు పై ఫిర్యాదుల పరంపర

హైదరాబాద్) ప్రజల్ని మోసం చేసిన
చంద్రబాబు మీద వైయస్సార్సీపీ నాయకులు ఎక్కడికక్కడ పోలీసు కేసులు నమోదు
చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గ కేంద్రాల్లోఈ కార్యక్రమం
పెద్ద ఎత్తున జరుగుతోంది.


ఎన్నికల సమయంలో అధికారాన్ని
దక్కించుకొనేందుకు చంద్రబాబు లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. రైతులకు రుణమాఫీ,
డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, పేదలకు పక్కా ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేదంటే
భ్రతి, ప్రత్యేక హోదా మొదలైన అనేక హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక ఈ
హామీలను గాలికి వదిలేసి ప్రజల్ని మోసగించారు. రెండేళ్లుగా హామీలు అమలు
అవుతాయోమోనని ఎదురు చూసిన ప్రజానీకం విసుగు చెందారు. దీంతో ప్రజల తరుపున
వైయస్సార్సీపీ బాధ్యత తీసుకొని ఎక్కడికక్కడ చీటింగ్ కేసులు నమోదు చేస్తోంది.


          శ్రీకాకుళం
జిల్లా లో పార్టీ అధ్యక్షులు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫిర్యాదుల
నమోదు కార్యక్రమం జరుగుతోంది. విజయనగరం జిల్లా లో పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ
కోలగట్ల వీరభద్ర స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. విశాఖపట్నం నాలుగో
టౌన్ పోలీసు స్టేషన్ లో పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్ నాథ్, నియోజకవర్గ
సమన్వయకర్త వంశీక్రిష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఫిర్యాదులు చేశారు. అటు వన్ టౌన్ పీఎస్
లో కోలా గురువు, జాన్ వెస్లీ నాయకత్వంలో కేసులు పెట్టారు.


          తూర్పు
గోదావరి జిల్లా సఖినేటిపల్లిలో ఆలూరు క్రిష్ణంరా జు ఆధ్వర్యంలో అమలాపురంలో మాజీ
మంత్రి విశ్వరూప్, కుడూపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో పోలీసు కేసులు పెట్టారు.
పిఠాపురం లో నియోజకవర్గ సమన్వయకర్త పెండెం దొరబాబు నాయకత్వంలో కేసులు పెట్టారు.
పశ్చిమ గోదావరి జిల్లా లో పార్టీ అధ్యక్షులు ఆళ్ల నాని నాయకత్వంలో ఫిర్యాదులు
చేస్తున్నారు. పాలకొల్లు లో వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ మేకా
శేషుబాబు నాయకత్వంలో భారీ ర్యాలీ చేశారు. అనంతరం టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.


          గుంటూరు,
క్రిష్నా, ప్రకాశం జిల్లా లో అనేక చోట్ల పోలీసు స్టేషన్ లలో పోలీసు కేసులు నమోదు
చేశారు.

          నెల్లూరు
జిల్లాలో పెద్ద ఎత్తున వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు పాలన తీరు
మీద ధ్వజమెత్తారు. నాలుగో టౌన్ పోలీసు స్టేషన్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్
రెడ్డి నాయకత్వంలో, నాలుగో టౌన్ పోలీసు స్టేషన్ లో డిప్యూటీ మేయర్ ముక్కాల
ద్వారకానాథ్ నేత్రత్వంలో ఫిర్యాదు నమోదు చేశారు. వెంకటాచలం పోలీసు స్టేషన్ దగ్గర
వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే కాకాణి
గోవర్దన్ రెడ్డి నాయకత్వంలో ర్యాలీ తీశారు. అనంతరం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు
చేశారు.

          చిత్తూరు
జిల్లా లో నగర ఒన్ టౌన్ పోలీసు స్టేషన్ లో వైయస్సాసీపీ నాయకులు జంగాలపల్లి
పురుషోత్తంరెడ్డి, చంద్రశేఖర్ తదితరులు ఫిర్యాదుచేశారు. శ్రీకాళహస్తి పోలీసు
స్టేషన్ లో తంబళ్లపల్లి పోలీసు స్టేషన్ లో వైయస్సార్సీపీ శ్రేణులు ఫిర్యాదు నమోదు
చేశారు. వైయస్సార్
జిల్లా పులివెందులలో వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు  మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి, ఎంపీ వైయస్ అవినాష్
రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. అనంతరం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు
చేశారు. రాజంపేటలో వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ర్యాలీ తీశారు. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ప్రొద్దూటూరు వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో వైయస్సార్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. 

          కర్నూలు జిల్లా పాణ్యం పోలీసు స్టేషన్ లో ఎమ్మెల్యే గౌరు
చరితరెడ్డి, జిల్లా అధ్యక్షులు గౌరు వెంకట్ రెడ్డి పోలీసు కంప్లయింట్ ఇచ్చారు.
బనగానపల్లె పోలీసుస్టేషన్ లో మాజీమంత్రి కాటసాని రాంరెడ్డి ఫిర్యాదు చేశారు.  అనంతపురం జిల్లాలో అనేకచోట్ల పోలీసు కేసులు
నమోదు అయ్యాయి. 

Back to Top