విజయమ్మ అరెస్టుపై హక్కుల సంఘంలో ఫిర్యాదు

హైదరాబాద్, 4 నవంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మను నల్గొండ జిల్లాలో అప్రజాస్వామికంగా పోలీసులు అరెస్టు చేశారంటూ పార్టీ లీగల్ సె‌ల్ న్యాయవాదులు మావన హక్కుల సంఘం(హెచ్ఆ‌ర్సి)కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన హెచ్ఆర్‌సి జరిగిన సంఘటనపై ఈ నెల 21లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. వరద బాధితులను పరామర్శించేందుకు నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లిన శ్రీమతి విజయమ్మను గత నెల 31న పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ఖమ్మం-నల్గొండ జిల్లాల సరిహద్దుల్లోని పైనంపల్లి వద్ద పోలీసులు ఆమెను అడ్డుకొని అరెస్టు చేశారు. అందుకు శ్రీమతి విజయమ్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Back to Top