వైయస్‌ జగన్‌ను కలిసిన సినీనటుడు కృష్ణుడుఉద్యోగాల కల్పన హామీపై హర్షం..
శ్రీకాకుళంః  సినీనటుడు కృష్ణుడు వైయస్‌ జగన్‌ను కలిశారు. నైరా వ్యవసాయ కళాశాల విద్యార్థులకు ఉద్యోగాల కల్పనకు హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. స్థానిక యువతకు ఉపాధి,ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తామన్న వైయస్‌ జగన్‌ హామీ పట్ల యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వేలాది మంది మహిళలు స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొంటున్నారని, జగన్‌ సీఎం అయితే కష్టాలు తీరుతాయని మహిళలు భావిస్తున్నారని తెలిపారు.

 వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 323వ రోజు సోమవారం ఉదయం నరసన్నపేట నియోజకవర్గంలోని జమ్ము జంక్షన్‌ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి టెక్కలిపాడు క్రాస్‌, రావాడపేట, చిన్నదుగాం జంక్షన్‌, నారాయణ వలస, రాణ జంక్షన్‌ మీదుగా లింగాల వలస వరకు జననేత పాదయాత్ర  కొనసాగనుంది.

వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతోన్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారి పొడువునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. జననేతను చూసేందుకు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహం చూపిస్తున్నారు. వైఎస్‌ జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు యువతీ, యువకులు పోటీపడుతున్నారు. 


Back to Top