చిలకలపూడి నుంచి మరో ప్రజాప్రస్థానం ప్రారంభం

చిలకలపూడి (కృష్ణాజిల్లా), 3 ఏప్రిల్‌ 2013: శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర హుషారుగా కొనసాగుతున్నది. 110వ రోజు బుధవారం ఉదయం ఆమె పాదయాత్రను చిలకలపూడి సర్కిల్ నుంచి ప్రారంభించారు. అక్క‌డి నుంచి బోసువారితోట, పెసరమిల్లి, బుద్దలపాలెం ఎక్సు రోడ్, హుస్సేనిపాలెం‌ వరకూ పాదయాత్ర చేస్తారు. అక్కడ మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. అనంతరం శ్రీమతి షర్మిల బరబోతుపాలెం మీదుగా పెడన చేరుకుంటారు. పెడన పెట్రోలు బంకు సమీపంలో శ్రీమతి షర్మిల పాదయాత్ర 1500 కిలో మీటర్ల మైలురాయికి చేరుకుంటుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అక్కడ మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరిస్తారు. పెడన బస్‌స్టాండ్‌ సమీపంలో జరిగే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. బహిరంగ సభ ముగిసిన తరువాత పెడనలోనే ఆమె బుధవారం రాత్రికి బసచేస్తారు. కాగా, బుధవారంనాడు శ్రీమతి షర్మిల మొత్తం 13.2 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేస్తారు.
Back to Top