మోసకారి బాబుపై చీటింగ్ కేసులు

రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుపై 420 కేసులు
ప్రజలను దగా చేసిన బాబుపై పీఎస్ లలో  ఫిర్యాదులు

రెండేళ్లుగా విచ్చలవిడి అవినీతికు పాల్పడుతూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను వంచించిన ముఖ్యమంత్రిపై రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ శ్రేణులు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేస్తున్నారు. వందలాది వాగ్ధనాలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...అందులో ఏ ఒక్కటీ అమలు చేయకుండా ప్రజలను నయవంచనకు గురిచేశారు.  దీంతో, ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా వైయస్సార్సీపీ మోసపూరిత ప్రభుత్వంపై  పోరాటానికి సిద్ధమైంది. ఎక్కడిక్కడ బాబు మోసాలను ఎండగడుతూ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లలో చీటింగ్ కేసులు పెడుతున్నారు. 

               చిత్తూరు జిల్లా మదనపల్లె పీఎస్ లో ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. పుంగనూరు పీఎస్ లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్ది రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బాబుపై చీటింగ్ కేసు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో, నగరిలో ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో, బంగారు పాల్యెంలో ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బాబుపై పోలీస్ కేసులు పెట్టారు. 

             విజయనగరం జిల్లా కురుపాంలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో పోలీసు కేసులు పెట్టారు.  సాలూరు పీఎస్ లో ఎమ్మెల్యే రాజన్న దొర ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు బాబుపై చీటింగ్ కేసులు పెట్టారు. బొబ్బిలి పీఎస్ లో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, సాంబశివరాజు ఆధ్వర్యంలో, నెల్లిమర్ల పీఎస్ లో సురేష్ బాబు, త్రినాథరావు ఆధ్వర్యంలో, ఎస్.కోటలో నాయుడుబాబు, మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మోసకారి చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. 


           విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. గాజావాకలో నాగిరెడ్డి, భీమిలిలో కర్రి సీతారాం, చోడవరం పీఎస్ లో కరణం ధర్మశ్రీ, అనకాపల్లిలో జానకీరామరాజు, నర్సీపట్నంలో గణేష్ ఆధ్వర్యంలో బాబుపై పోలీస్ కేసులు పెట్టారు. 


               కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు స్థానిక పీఎస్ లో మోసకారి చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టారు. తిరువూరులో ఎమ్మెల్యే రక్షణనిధి ఆధ్వర్యంలో,  పెనుమలూరు పీఎస్ లో పార్టీ సీనియర్ నేత పార్థసారథి ఆధ్వర్యంలో, జగ్గయ్యపేటలో పార్టీ ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో, గన్నవరం పీఎస్ లో రామచంద్రారావు ఆధ్వర్యంలో, మైలవరం పీఎస్ లో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, పామర్రులో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుపై 420 కేసులు పెట్టారు.  బాబు మోసాలపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధ నేతృత్వంలో విజయవాడ గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 



  చంద్రబాబు మోసాలపై అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో వైయస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.  పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పార్టీ నేత డాక్టర్ సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో కంప్లయింట్‌ చేశారు. 

        చంద్రబాబు మోసాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైయస్సార్ సీపీ నేతలు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా స్థానిక పీఎస్లలో ఫిర్యాదులు చేశారు. చీరాలలో బాలాజీ, ఒంగోలు వన్టౌన్లో కొప్పంప్రసాద్, వెంకట్రావు, వేణుగోపాల్ నేతృత్వంలో బాబుపై కేసులు నమోదు చేయాలని కంప్లయింట్‌ చేశారు.


Back to Top