చంద్ర‌బాబు రాజీనామాకు సిద్ధమా..!

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నైజం మరోసారి బయటపడింది. ప్రత్యేకహోదాపై
ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలోకి నెడుతున్న
చంద్రబాబు మరోసారి అదే ప్రయత్నం చేశారు.  స్టేట్ మెంట్ కు , బాబు మాట్లాడిన
మాటలకు అసలు పొంతనే లేదని జగన్ తెలిపారు. అసెంబ్లీలో బాబు మాట్లాడిన
వ్యాఖ్యలు, స్టేట్ మెంట్ లో ఉన్నట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని,
లేదంటే చంద్రబాబు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని  సవాల్ విసిరారు.
అసెంబ్లీలో పచ్చపార్టీ  కుట్రను బహిర్గతం చేేశామన్నారు.  

మొదటిరోజు
సమావేశాలు వాయిదా పడిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. స్పెషల్ స్టేటస్
పేరుతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని  ధ్వజమెత్తారు.
అసెంబ్లీలో 12 గంటల తర్వాత ప్రశ్నోత్తరాలు జరగడం ఇంతవరకు ఎప్పుడూ
 చూడలేదన్నారు. కౌరవ సభ తాను చూడలేదు గానీ..అంతకన్నా దారుణంగా ఇవాళ సభ
జరిగిందని జగన్ ఆరోపించారు. రాజకీయాలు ఇంతగా దిగజారుతాయని తాను
అనుకోలేదన్నారు. 

ఇవాళ సభ మొత్తం కుట్రతోనే
జరిగిందని జగన్ అన్నారు. చంద్రబాబు పద్ధతి ప్రకారం మాట్లాడిన మాటలు మాత్రమే
ప్రజల్లోకి వెళ్లేలా చూశారని చెప్పారు. ప్రజలను గందరగోళంలోకి నెట్టడమే
చంద్రబాబు లక్ష్యమని జగన్ విమర్శించారు. చంద్రబాబు ప్రత్యేకహోదా కు
అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ చేశారు.
Back to Top